తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుట్టినరోజు వేడుకలు వద్దు.. పెళ్లి వాయిదా వేస్తున్నా' - movie news

వచ్చే నెలలో జరగాల్సిన హీరో నితిన్ పెళ్లి వాయిదా పడింది. ఈ విషయంతో పాటు పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవద్దని అభిమానులకు చెప్పాడీ కథానాయకుడు.

'పుట్టినరోజు వేడుకలు వద్దు.. పెళ్లి వాయిదా వేస్తున్నా'
నితిన్ శాలిని

By

Published : Mar 29, 2020, 4:29 PM IST

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి వచ్చే నెల 16న జరగాల్సిన తన వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు యువ హీరో నితిన్ చెప్పాడు. అలానే రేపు(సోమవారం) జరగాల్సిన తన పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.

నితిన్ విడుదల చేసిన ప్రకటన

దుబాయ్​లో ఏప్రిల్ 16న, తన ప్రేయసి శాలినితో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు సన్నాహాలు చేశాడు నితిన్. కరోనా ప్రభావం వల్ల పెళ్లికి ఇది సరైన సమయం కాదని నిర్ణయించుకున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. తన పుట్టినరోజును అభిమానులెవరూ జరుపుకోవద్దని అన్నాడు. ఈ సంక్షోభ సమయంలో ఫ్యాన్స్​ ఆరోగ్యమే తనకు ప్రాధాన్యమన్నాడు. కాలు బయటపెట్టకుండా దేశాన్ని కాపాడాలని సూచించాడు.

నితిన్ నటిస్తున్న 'రంగ్​ దే' సినిమా మోషన్​ పోస్టర్​ను నేడు(ఆదివారం) విడుదల చేశారు. కీర్తి సురేశ్ హీరోయిన్​. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తుండగా, సితార ఎంటర్​టైన్​మెంట్స్ నిర్మిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details