చిత్రపరిశ్రమలో హీరోగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో రెండు వరుస విజయాలు అందుకున్నా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో పడుతూ లేస్తూ సినీ ప్రయాణాన్ని నెట్టుకొచ్చారు. 'ఇష్క్' సినిమా లాంటి సరికొత్త ప్రేమకథతో సక్సెస్‌ను అందుకొని.. అక్కడి నుంచి వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు యువ కథానాయకుడు నితిన్. చిత్రసీమలో అడుగుపెట్టి ఇటీవలే 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మంగళవారం (మార్చి 30) ఆయన పుట్టినరోజు సందర్భంగా నితిన్ వ్యక్తిగత జీవితంతో పాటు సినిమా విశేషాలను తెలుసుకుందాం.
వ్యక్తిగతం
నితిన్.. 1983 మార్చి 30న తెలంగాణలోని నిజామాబాద్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చిత్ర పంపిణీ దారు సుధాకర్ రెడ్డి, లక్ష్మీ రెడ్డి. నిఖితా రెడ్డి సోదరి. హైదరాబాద్‌లోని గీతాంజలి స్కూల్లో ప్రాథమిక చదువును పూర్తి చేశారు. రత్న జూనియర్ కళాశాలలో ఎమ్.పీ.సీ విభాగంలో ఇంటర్మీడియట్ చదివారు. గతేడాది శాలిని కందుకూరి అనే ఆమెను ప్రేమించి పెళ్లాడారు నితిన్.
సినీ అరంగేట్రం
'నువ్వు నేను' సినిమాను సుదర్శన్ 35ఎమ్ఎమ్ థియేటర్లో ప్రదర్శిస్తున్న సమయంలో దర్శకుడు తేజ.. నితిన్‌ను రెండుసార్లు చూశారట. ఆ తర్వాత నితిన్ గురించి ఆరా తీసి.. నటనలో ఆసక్తి ఉందో లేదో కనుక్కొని ఆ తర్వాత 'జయం' సినిమాలో హీరోగా నితిన్‌కు అవకాశాన్ని ఇచ్చారట. అలా తేజ డైరెక్షన్లో నితిన్, సదా హీరోహీరోయిన్లుగా రూపొందిన జయం సినిమా 2002 ఫిబ్రవరి 14న విడుదలైంది.
ఆ సినిమా సూపర్‌హిట్ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో దిల్ సినిమాలో నితిన్ హీరోగా నటించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించడం వల్ల నితిన్‌కు ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చేసింది. ఇదే సినిమాతో సినిమాల పంపిణీ దారుగా ఉన్న దిల్ రాజు నిర్మాతగా మారారు.
'దిల్' తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రాలు 'సంబరం', 'శ్రీ ఆంజనేయం' వంటి సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'సై' చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న నితిన్.. ఆ తర్వాత విడుదలైన 'ధైర్యం', 'అజ్యాత్' (హిందీ చిత్రం), 'సీతారాముల కల్యాణం' సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్‌ను అందుకోలేకపోయారు.
వరుస ఫ్లాప్‌లు..