హీరో నిఖిల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. గత నెల 2న తన ప్రేయసి, డాక్టర్ పల్లవితో నిశ్చితార్ధాన్ని జరుపుకొన్న ఇతడు.. వచ్చే నెల 16న వివాహం చేసుకోనున్నాడు. కరోనా ప్రభావంతో ఇతడి పెళ్లి వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించాడు. కరోనా కావొచ్చు, ఇంకేదైనా కారణం కావొచ్చు.. ఏమైనా సరే తన పెళ్లి అనుకున్న తేదీ ప్రకారం జరుగుతుందని నిఖిల్ అన్నాడు.
" ఏప్రిల్ 16న ఎట్టి పరిస్థితిలోనూ నా పెళ్లి జరిగి తీరుతుంది. కరోనా కాదు ఏమొచ్చినా ఆగదు. ఒకవేళ విపత్కర పరిస్థితులు ఎదురైతే, గుడిలోనైనా పెళ్లి చేసుకుంటాం. వాయిదా వేసే ఉద్దేశం లేదు"