యువ కథానాయకుడు నిఖిల్ వివాహం గురువారం హైదరాబాద్ సమీపంలోని శామీర్‌పేట్‌లో ఓ ప్రైవేట్ అతిథి గృహంలో జరిగింది. గురువారం ఉదయం గం.6.31ని.లకు పెళ్లి జరిగింది. డా.పల్లవి వర్మని ఆయన ప్రేమించి పెళ్లాడారు. లాక్డౌన్ ముందే వీరి నిశ్చితార్థం జరగ్గా.. ఏప్రిల్ 16న వివాహం జరపాలనుకున్నారు. కానీ కరోనా ప్రభావం వల్ల వేడుక వాయిదా పడింది. అయితే పరిస్థితులు కుదుటపడ్డాకే పెళ్లి చేసుకుంటానని నిఖిల్ చెప్పారు.
లాక్డౌన్ మ్యారేజ్: డాక్టర్తో యాక్టర్ ప్రణయగానం - లాక్డౌన్ మ్యారేజ్: డాక్టర్తో యాక్టర్ పారాయణం
యువకథానాయకుడు నిఖిల్, పల్లవిల వివాహం గురువారం హైదరాబాద్ సమీపంలోని శామీర్పేటలో జరిగింది. ఉదయం గం.6.31ని.లకు నిఖిల్.. పల్లవి మెడలో తాళి కట్టారు.
![లాక్డౌన్ మ్యారేజ్: డాక్టర్తో యాక్టర్ ప్రణయగానం Hero Nikhil got Marriage with Dr.pallavi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7189229-615-7189229-1589424905531.jpg)
లాక్డౌన్ మ్యారేజ్: డాక్టర్తో యాక్టర్ పారాయణం
మరోవైపు ఇప్పుడిప్పుడే ముహూర్తాలు లేకపోవడం వల్ల.. వధూవరుల జాతకాల రీత్యా నేడు వివాహం జరపాలని ఇరు కుటుంబాలు నిశ్చయించాయి. కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి వేడుక జరిగింది.
ఇదీ చూడండి.. ఈ ఏడాదిలోనే రానా వివాహం: సురేశ్ బాబు
Last Updated : May 14, 2020, 8:45 AM IST