తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డైరక్టర్​గా మారిన స్టార్​ హీరో సోదరి - DEEPTHI GANTA

కథానాయకుడు నాని సోదరి దీప్తి దర్శకురాలిగా మారింది. ఫాదర్స్​ డే సందర్భంగా ఆమె తెరకెక్కించిన 'అనగనగా ఒక నాన్న' షార్ట్​ఫిల్మ్​ను విడుదల చేశారు.

డైరక్టర్​గా మారిన హీరో నాని సోదరి

By

Published : Jun 16, 2019, 6:49 PM IST

డైరక్టర్​ కావాల్సిన నాని టాలీవుడ్​ హీరోగా మారాడు. బాపు, రాఘవేంద్రరావు వంటి ప్రముఖుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఈ నేచురల్ స్టార్... ప్రస్తుతం విభిన్న చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. 'అష్టాచమ్మా'తో ఎంట్రీ ఇచ్చిన ఈ కథానాయకుడు నిర్మాతగానూ పలు చిత్రాల్ని రూపొందించాడు. త్వరలో ఆయన దర్శకత్వం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

కానీ అంతకంటే ముందే నాని ఇంటిలో ఒకరు డైరక్టర్​గా మారారు. అతడి సోదరి దీప్తి గంటా.. 'అనగనగా ఒక నాన్న' అనే లఘచిత్రాన్ని తీశారు. ఫాదర్స్​ డే సందర్భంగా ఆ షార్ట్​ఫిల్మ్​ను విడుదల చేశారు. హీరో నాని నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్న లఘచిత్రం

ఇది చదవండి: 'ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు' అంటున్న హీరో నాని

ABOUT THE AUTHOR

...view details