తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'టాక్సీవాలా' దర్శకుడితో నేచురల్​ స్టార్..?​ - నాని తాజా సినిమా వార్తలు

విజయ్​ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా' సినిమాతో హిట్​ కొట్టిన దర్శకుడు రాహుల్​ సాంకృత్యన్​. తదుపరి చిత్రాన్ని నేచురల్​ స్టార్​ నానితో తెరకెక్కించబోతున్నట్లు సినీ వర్గాల టాక్​.

hero nani next movie with takshi wala director
'టాక్సీవాలా' దర్శకుడితో నాచురల్​ స్టార్..?​

By

Published : Dec 11, 2019, 1:30 PM IST

విజయ్​ దేవరకొండ హీరోగా రాహుల్​ సాంకృత్యన్​ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. కామెడీ థ్రిల్లర్​గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు రాహుల్..​ తదుపరి ప్రాజెక్ట్​ను నేచురల్​ స్టార్​ నానితో తీయబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఇద్దరి మద్య చర్చలు జరిగాయని, నానికి కూడా కథ నచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్​. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నాని 'వి' అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్‌ జగదీష్‌' చిత్రాన్ని మొదలుపెట్టాడు.

ABOUT THE AUTHOR

...view details