హీరో, నిర్మాత, టీవీ వ్యాఖ్యత.. ఇలా విభిన్న రంగాల్లో తన ప్రతిభ చూపించిన నాగార్జున, ఇప్పుడు మరో అడుగు ముందుకేసేందుకు సిద్ధమవుతున్నారట. సొంతంగా ఓటీటీ యాప్‌ను లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఎలాంటి సమాచారం రానప్పటికీ, ప్రస్త్తుతం దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని టాక్.
సొంత ఓటీటీ యాప్‌తో హీరో నాగార్జున! - Nagarjuna wild dog movioe
ప్రస్తుతమున్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు పోటీగా తెలుగులోకి మరో యాప్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కథానాయకుడు నాగార్జున ప్రస్తుతం ఈ పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
నాగార్జున
అన్నపూర్ణ ఫిల్మ అండ్ మీడియా స్కూల్లోని వాళ్లకు ఈ ఓటీటీ ద్వారా అవకాశాలు ఇవ్వాలని నాగార్జున భావిస్తున్నారట. ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలో డిజిటల్ కంటెంట్ గురించి ఈయన మాట్లాడారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తర్వాతి కాలంలో ఓటీటీదే హవా అని అన్నారు.