తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యువ హీరో నాగశౌర్యకు గాయాలు - tollywood

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్యకు గాయాలయ్యాయి. సినిమా షూటింగ్​లో జరిగిన యాక్సిడెంట్​ కారణంగా కాలికి దెబ్బలు తగిలాయి.

నాగశౌర్య

By

Published : Jun 15, 2019, 5:26 AM IST

టాలీవుడ్ యువ కథానాయకుడు నాగ‌శౌర్య‌కు యాక్సిడెంట్ అయింది. అయితే ఇది రోడ్డు ప్ర‌మాదం కాదు. షూటింగ్ సెట్లో జ‌రిగిన యాక్సిడెంట్. నాగ‌శౌర్య ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహరీన్ హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ఒక‌టి చిత్రీక‌రిస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగిందట.

కాలికి గాయం అయింది. గాయాన్ని ప‌రిశీలించిన వైద్యులు 25 రోజుల విశ్రాంతి అవ‌స‌రమని తేల్చారు. షూటింగ్‌కు కొన్ని రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నాగ‌శౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేష‌న్స్ లోనే ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. నాగ శౌర్య నటించిన 'ఓ బేబీ' సినిమా జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గాయపడ్డ నాగ శౌర్య

ఇవీ చూడండి.. 'చాంగు భళా.. చాంగు భళా.. ఇలాగా'

ABOUT THE AUTHOR

...view details