'జనతా కర్ఫ్యూ' ప్రకటించిన నేపథ్యంలో దేశం మొత్తం ఇళ్లకే పరిమితమైంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఇంట్లోనే వివిధ రకాల పనులు చేసుకుని కాలం గడుపుతున్నారు. టాలీవుడ్ హీరో నాగశౌర్య, తన అమ్మ దగ్గర ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఆమె దగ్గర కూర్చొని తయారీ విధానం చెబుతుండగా శౌర్య, ఆవకాయ కలుపుతూ ఉన్నాడు. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
అమ్మ దగ్గర ఆవకాయ చేయడం నేర్చుకుంటున్న హీరో - corona news
టాలీవుడ్ హీరో నాగశౌర్య, 'జనతా కర్ఫ్యూ' వల్ల వచ్చిన ఖాళీ సమయంలో అమ్మ దగ్గర ఆవకాయ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటున్నాడు.
హీరో నాగశౌర్య
ఇటీవలే 'అశ్వథ్థామ' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగశౌర్య. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో లక్ష్మి అనే కొత్త దర్శకురాలు తీస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. కరోనా ప్రభావంతో చిత్రీకరణకు ఇబ్బంది ఏర్పడింది.