నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'థాంక్యూ'(thank you movie telugu) సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇందులో నాగచైతన్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
బుల్లితెర వ్యాఖ్యాత సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'జయమ్మ పంచాయతీ'(suma jayamma panchayati movie song released).తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో నటుడు నాని ఈ చిత్రంలోని తొలి గీతాన్ని విడుదల చేశారు. 'తిప్పగలనా చూపులు నీ నుంచే ఏ వైపేనా' అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతానికి ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. పీవీఎన్‌ఎస్ రోహిత్ ఆలపించారు. ఈ సినిమాకు కలివారపు విజయ్‌కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుమ ఓ గ్రామ పెద్దగా కనిపించనున్నారు.