Hero OTT release date: ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన 'హీరో'.. ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే బుధవారం, రిలీజ్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ సినిమాతో మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ హీరోగా పరిచయమయ్యారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.
F3 movie: 'ఎఫ్3' మూవీ కొత్త అప్డేట్కు టైమ్ ఫిక్సయింది. గురువారం ఉదయం 10:08 గంటలకు ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అప్డేట్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
'ఎఫ్ 2' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్‌తేజ్‌తో పాటు సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. సోనాల్ చౌహాన్ ప్రత్యేక పాత్రలో నటించింది. అనిల్ రావిపూడి హీరోయిన్. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు.