ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ అందుకున్నాడు హీరో రామ్. ఫుల్ జోష్‌తో చిత్రబృందంతో కలిసి వేడుకలు చేసుకుంటున్నాడు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సెట్లో సందడి చేశాడీ యువ హీరో. వీరిద్దరూ కలిసున్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. "ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్‌తో ఎన్కౌంటర్ శంకర్ ముచ్చట్లు" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
పూర్తి మాస్ మసాలా సినిమాగా తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్'.. ప్రస్తుతం వందకోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. నభా నటేశ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.