తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిమానికి మాధవన్​ క్షమాపణలు.. ఎందుకంటే? - క్షమాపణలు చెప్పిన నటుడు మాధవన్​

సీనియర్​ నటుడు మాధవన్​ సోషల్ ​మీడియా వేదికగా తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఆయన తాజాగా నటించిన సినిమా నిశ్శబ్దం గురించి ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

Madhavan
మాధవన్​

By

Published : Oct 10, 2020, 8:29 AM IST

మాధవన్​, అనుష్క, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'నిశ్శబ్దం'. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. మాధవన్‌ సైకోలా కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన ట్విట్టర్‌ వేదికగా కాసేపు అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని 'నిశ్శబ్దం' ఫ్లాష్‌బ్యాక్‌ కన్విన్స్‌ చేసేలా లేదు. మీరేం అంటారు? అని కామెంట్‌ చేయగా మాధవన్‌ రిప్లై ఇచ్చారు. 'ఇప్పుడు నేను కేవలం క్షమాపణలు మాత్రమే చెప్పగలను' అని పేర్కొన్నారు. ఇలా ఆయనకు, అభిమానులకు మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణలు చూద్దాం..

కోలీవుడ్‌లో మీరు నటించిన చిత్రాల్లో మీకిష్టమైన చిత్రం ఏది?

మాధవన్‌: సఖి.

మీరు అద్భుతంగా నటించిన పాత్ర?

మాధవన్‌: నాకు తెలిసి రాకెట్రీలో..

రాకెట్రీ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది?

మాధవన్‌: నేనూ దాని కోసమే ఎదురుచూస్తున్నా.

మైఖేల్‌ మాడిసన్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

మాధవన్‌: మా ఇద్దరి మధ్య సన్నివేశాలు తక్కువ. అయినప్పటికీ అది ఓ మధుర జ్ఞాపకం.

తెలుగులో మిమ్మల్ని పాజిటివ్‌ రోల్‌లో చూడాలని ఉంది.

మాధవన్‌: అలాంటి పాత్ర ఒప్పుకొన్నా.. అతి త్వరలో మీ ముందుకు వస్తా.

సూర్య గురించి చెప్పండి?

మాధవన్‌: నాకిష్టమైన మంచి సోదరుడు.

ఒక పాత్ర కోసం ఎవరైనా దర్శకుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు కథ వినకుండా ఎప్పుడైనా సంతకం చేశారా? చేస్తే, ఆ దర్శకుడు ఎవరు?

మాధవన్‌: నేను దర్శకుడినైతేనే అది సాధ్యమవుతుంది.

స్వీటీతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

మాధవన్‌: చక్కటి అనుభవం.. ఆమె చాలా సౌమ్యమైన మహిళ.

నిశ్శబ్దం సినిమా విషయంలో మీకు కష్టంగా అనిపించిన విషయం?

మాధవన్‌: విడుదల విషయంలో తికమకగా అనిపించింది. కొవిడ్‌ నేపథ్యంలో చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది.

నిశ్శబ్దం కథ నచ్చిందా? లేదా నటించాలని నటించారా?

మాధవన్‌: కొన్నిసార్లు విజయం సాధిస్తాం.. మరికొన్ని సార్లు పరాజయం చవిచూస్తాం. దీనికి మించి ఏం చెప్పగలను. మావంతు కృషి మేం చేశాం.

50 ఏళ్ల వయసులోనూ ఇంత అందంగా ఎలా ఉన్నారు? నిజంగా ఇది గొప్ప విషయం. ఎప్పటికైనా నా క్రష్‌ మీరే.

మాధవన్‌: ధన్యవాదాలు.. అదంతా మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది.

విజయ్‌ గురించి మీ అభిప్రాయం?

మాధవన్‌: అతడు అద్భుతమైన వ్యక్తి. నా కుటుంబ సభ్యుడితో సమానం.

ఇన్నేళ్లు అవుతున్నా అంతే అందంగా ఉన్నారు. మీ యంగ్‌ లుక్‌ వెనుక రహస్యం ఏంటి?

మాధవన్‌: మీకలా అనిపించడం నా అదృష్టం. కానీ నా అద్దం మీరు చెప్పిన మాటల్ని వ్యతిరేకిస్తోంది (నవ్వుతున్న ఇమోజీ).

షారుక్‌ ఖాన్‌ గురించి ఒక్కమాటలో చెప్పండి?

మాధవన్‌: ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వారు. నేను కూడా ఆయనకు అభిమానినే.

నిశ్శబ్దం సినిమాలో మీ నటన బాగుంది. ఆంటోనీ పాత్రలో మీకు నచ్చిన విషయం ఏంటి?

మాధవన్‌: అతడి గుండె పగిలింది.. కానీ ప్రమాదకరమైన వ్యక్తి.

మీ విజయం రహస్యం?

మాధవన్‌: నేనింకా నేర్చుకుంటున్నా..

ఏ సినిమానైనా తిరస్కరించిన తర్వాత.. వదులుకున్నందుకు బాధపడ్డారా?

మాధవన్‌: అలాంటివి ఎప్పుడూ జరగలేదు.

ఇదీ చూడండి బాక్సాఫీస్ విక్రమార్కుడు.. ఈ దర్శక ధీరుడు

ABOUT THE AUTHOR

...view details