కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన 'కేజీఎఫ్'.. దేశవ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ 'కేజీఎఫ్: చాప్టర్ 2' తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే తాజాగా ఈ సినిమా నుంచి జులై 29న ఉదయం 10 గంటలకు సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశాంత్ స్పష్టం చేశాడు. క్రూరత్వాన్ని పరిచయం చేయబోతున్నాం.. అంటూ పోస్టర్ను పోస్ట్ చేశాడు.
ఈ ట్వీట్ ఆధారంగా చిత్రంలో అరివీర భయంకర రాక్షసుడు 'అధీర' పాత్ర లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అధీర పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించారు. 29న ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సంజయ్ లుక్ విడుదల చేయబోతుంది.