శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తన అభిమాని మృతి చెందారనే వార్త తెలుసుకుని కార్తీ కన్నీటి పర్యంతమయ్యాడు.
అభిమాని మృతితో కార్తీ కన్నీటి పర్యంతం - తెలుగు సినిమా వార్తలు
చెన్నైలో తన అభిమాని రోడ్డు ప్రమాదంలో మరణించాడని కన్నీటి పర్యంతమయ్యాడు హీరో కార్తీ. ఈ విషయం తెలిసిన వెంటనే అతని ఇంటికి వెల్లి నివాళులర్పించాడు. బాధితుని కుటుంబ సభ్యులను పరామర్శించాడు.
అభిమాని మృతితో దిగ్భ్రాంతి చెందిన కార్తి
చెన్నైలోని ఉలుందర్‌పేట్‌కు చెందిన వ్యసాయి నిత్య అనే వ్యక్తి కార్తీకి వీరాభిమాని. 'కార్తి మక్కల్ నల మండ్రమ్' సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో నిత్యం ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహించేవాడు. తెల్లవారుజామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సదరు అభిమాని మృతిచెందాడు. ఈ విషయం తెలుకున్న కార్తీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అనంతరం అభిమాని ఇంటికి చేరుకుని నివాళులర్పించి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించాడు.
ఇదీ చూడండి:'ఈ విషయంలో చిరంజీవికి చాలా థ్యాంక్స్'