Karthikeya valimai: యువ నటుడు కార్తికేయ.. తమిళంలో విలన్‌గా చేసిన తొలి సినిమా 'వలిమై'. తెలుగులోనూ ఈ చిత్రం ఫిబ్రవరి 24న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కార్తికేయ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆసక్తికర విషయాలు చెప్పారు.
'ఈ సినిమా చూసి మీ అభిమాన హీరో చిరంజీవి మీకు ఫోన్ చేసి, తన సినిమాలో విలన్‌గా చేయమంటే చేస్తారా?' అని కార్తికేయను ప్రశ్నించగా.. 'మెగాస్టార్ సినిమాల్ విలన్‌గా చేయగలుగుతానా లేదా అనేది నా డౌట్. విలన్‌గా అంటే ఆయనకు ఎదురుగా నిలబడి డైలాగ్స్ చెప్పాల్సి ఉంటుంది. ఆయనను చూడగానే కిందా మీదా అవుతాను. ఇక పెర్ఫార్మెన్స్కు అవకాశం ఎక్కడుంటుంది. విలన్‌గా కాకపోయినా ఆయన సినిమాలో ఓ మంచి రోల్ చేయాలని ఉంది. నా అభిమాన హీరోతో ఓ సినిమా చేశాననే సంతోషం, సంతృప్తి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అలాంటి అవకాశం కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను' అని కార్తికేయ చెప్పుకొచ్చారు.