దిగ్గజ నటుడు కమల్‌హాసన్‌కు కరోనా సోకింది(kamalhassan corona). ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురైనట్టు.. పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్‌గా తేలినట్టు వెల్లడించారు కమల్.
కమల్‌హాసన్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో చికిత్స - kamal haasan update
దిగ్గజ నటుడు కమల్‌హాసన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది(kamalhassan tested positive). ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
కమల్‌హాసన్
త్వరలోనే కమల్.. 'విక్రమ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు(kamalhassan vikram movie). లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీతో పాటు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన 'ఇండియన్ 2'లోనూ కమల్ నటించనున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఇదీ చూడండి:కమల్ నిర్మాతగా విజయ్-విక్రమ్ మల్టీస్టారర్ సినిమా!
Last Updated : Nov 22, 2021, 4:01 PM IST