తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కల్యాణ్​రామ్​ కొత్త సినిమా 'ఎమిగోస్​'! - కల్యాణ్​రామ్​ ఎమిగోస్ వార్తలు

కథానాయకుడు కల్యాణ్​రామ్​ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్​ నిర్మాణసంస్థ ఓ సినిమాను రూపొందిస్తోంది. ఈ చిత్రంతో రాజేంద్ర దర్శకుడిగా టాలీవుడ్​కు పరిచయం కానున్నారు. దీనికి 'ఎమిగోస్​' అనే టైటిల్​ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Hero Kalyan Ram's new movie title as Amigos
కల్యాణ్​రామ్​ కొత్త సినిమా టైటిల్​ 'ఎమిగోస్​'!

By

Published : May 2, 2021, 6:35 AM IST

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలు. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న 19వ సినిమా ఇది. దీనికి 'ఎమిగోస్‌' అనే పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం.

'ఎమిగోస్‌' అంటే తెలుగులో స్నేహితులు అని అర్థం. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్‌ మూడు పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. మరి మూడు పాత్రలా లేక, రెండు పాత్రలా అనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. కథానాయిక ఎంపికపై కూడా కసరత్తు చేస్తోంది చిత్రబృందం.

ఇదీ చదవండి:కొరటాల చిత్రంలో విద్యార్థి నాయకుడిగా ఎన్టీఆర్‌?

ABOUT THE AUTHOR

...view details