తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కల్యాణ్​రామ్​ కొత్త సినిమాకు దర్శకుడు ఖరారు - కల్యాణ్​రామ్​ వీఐ ఆనంద్

కథానాయకుడు కల్యాణ్​రామ్ కొత్త సినిమాకు వీఐ ఆనంద్ దర్శకుడు. ఈ మేరకు చర్చలు జరిగాయి. పరిస్థితులు చక్కదిద్దుకోగానే షూటింగ్ ప్రారంభిస్తారు.

కల్యాణ్​రామ్​ కొత్త సినిమాకు దర్శకుడు ఖరారు
కల్యాణ్​రామ్​

By

Published : Jun 27, 2020, 7:00 AM IST

టాలీవుడ్​లో మరో కొత్త కాంబినేషన్​కు​ రంగం సిద్ధమైంది. నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే స్క్రిప్టు పూర్తయింది. పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే సినిమాను ప్రారంభిస్తారు. 'డిస్కో రాజా' తర్వాత ఆనంద్‌ తీయనున్న చిత్రమిదే. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేష్‌.ఎస్‌.కోనేరు నిర్మిస్తారు.

కల్యాణ్​రామ్- దర్శకుడు వీఐ ఆనంద్

కల్యాణ్‌రామ్‌ ప్రస్తుతం మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తి చేసుకుని, వి.ఐ.ఆనంద్‌ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details