కొబ్బరిమట్ట సినిమా విడుదల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ అభిమాని ఆందోళనకు దిగాడు. సంపూర్ణేష్ బాబు అభిమాని రెడ్డప్ప సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. కొబ్బరి మట్ట చిత్రాన్ని మదనపల్లిలో విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. అతడి బంధువును సెల్‌టవర్ పైకి పంపి పోలీసులు చర్చలు జరిపారు. కిందిగి దిగేలా సంపూ అభిమానిని ఒప్పించారు. అనంతరం అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఉరుకులు పెట్టించిన అభిమానం...