"వాణిజ్య ప్రధానమైన సినిమా చేసినా.. అందులో ఏదో రకంగా కొత్తదనం ఉండాలనుకుంటా. నటుడిగానూ నేను సవాళ్లను ఇష్టపడతా. అచ్చంగా.. అలాంటి కథ, పాత్రలతోనే 'అల్లుడు అదుర్స్' రూపొందింది" అన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఆయన కథానాయకుడిగా, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా గురువారం చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సాయిశ్రీనివాస్ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాల్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
కొత్తగా ఉంటుంది.. ఆస్వాదిస్తారు
పరాజయం ఎదురైతే మళ్లీ వెంటనే సినిమా మొదలు పెడతామేమో కానీ.. విజయం వచ్చిందంటే జాగ్రత్తగా అడుగులు వేస్తాం. 'రాక్షసుడు' విజయం తర్వాత మూడు నెలలపాటు కథలు వినడంపైనే దృష్టిపెట్టా. సంతోష్ శ్రీనివాస్ అన్న చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. ముఖ్యంగా ద్వితీయార్థం నాకు బాగా నచ్చింది. రోహిత్‌శెట్టి 'గోల్‌మాల్' చూస్తున్నప్పుడు ఒక వాణిజ్య కథలో 'హారర్ అంశాలా, భలే ఉందే' అని ఆశ్చర్యపోయా. మళ్లీ అలాంటి అనుభూతి ఈ కథ విన్నప్పుడు కలిగింది. ఎప్పుడూ మనం చూసే కుటుంబ కథలు కాకుండా, ఇది చాలా కొత్తగా ఉంటుంది. చిన్న పిల్లలూ ఆస్వాదిస్తారు.
'అల్లుడు..' అచ్చొచ్చింది