"సింహం బోనులో నుంచి బయటకు వచ్చాక ఆగమంటే ఆగుతుందా? వేటాడటం మొదలుపెడుతుంది"... బాలకృష్ణ కొత్త సినిమా 'రూలర్'లో ఆయన పాత్ర అలాగే ఉంటుంది. ఇటీవలె విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. బాలకృష్ణ తెరపైనే కాదు... సెట్లోనూ అంతే హుషారుగా ఉంటాడని ఆయనతో పనిచేసిన దర్శకులు చెబుతుంటారు. ఒక్కసారి సెట్లోకి అడుగు పెట్టారంటే బాలయ్య ఆగరట. శరవేగంతో సన్నివేశాల్ని పూర్తి చేసేస్తుంటారట. ముఖ్యంగా డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణ స్టైలే వేరు. సుదీర్ఘంగా సాగే సంభాషణల్ని సైతం అలవోకగా చెప్పేస్తుంటాడు. ఇక పోరాట ఘట్టాలైతే డూప్ అవసరం కూడా లేకుండానే చేసేస్తుంటాడు. అందుకే ఆయన ప్రేక్షకులకూ అంతగా నచ్చేస్తుంటాడు.
బాలయ్య వేట ఆరంభం.. శరవేగంగా 'రూలర్'
కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం రూలర్. ఈ సినిమా షూటింగ్లో బాలయ్య యమ హూషారుగా ఉన్నాడట. ఒక వైపు దర్శకుడు చెప్పే సీన్లు వింటూనే... వాటి సంగతి నాకు వదిలేయండి చూసుకుంటా అంటున్నాడట.
hero balakrishna has full josh at ruler film making
ప్రస్తుతం రూలర్ చిత్రంలోనూ సన్నివేశాల వేట మొదలు పెట్టాడు బాలకృష్ణ. "దర్శకుడు ఒక పక్క సీన్ చెప్తుంటే, ఇక నాకు వదిలేయండి, నేను చూసుకుంటా" అంటూ బాలయ్య బాగా మద్దతిస్తున్నట్లు వెల్లడించింది చిత్రబృందం. 'జై సింహా' తర్వాత బాలకృష్ణ - కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం... డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇది చదవండి: భాగ్యనగర వీధుల్లో బెల్లంకొండ 'జర్నీ'