తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాస్ బీట్​కు బాలకృష్ణ స్టెప్పులు.. వీడియో వైరల్ - రూలర్ సినిమా

హీరో బాలకృష్ణ.. తమిళ హిట్​ సాంగ్​ 'అలుమా డోలుమా'కు స్పెప్పులేసి అలరించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్​గా అవుతోంది.

మాస్ బీట్​కు బాలకృష్ణ స్టెప్పులు.. వీడియో వైరల్
హీరో బాలకృష్ణ

By

Published : Nov 28, 2019, 11:46 AM IST

హీరో నందమూరి బాలకృష్ణ.. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం హల్​చల్ చేస్తున్నాడు. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య.. మాస్​ బీట్​కు స్టెప్పులేసి అలరించాడు. తమిళ హిట్​ గీతం 'అలుమా డోలుమా' పాటకు తనదైన రీతిలో డ్యాన్స్​ చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

బాలకృష్ణ.. ప్రస్తుతం 'రూలర్​' సినిమాతో బిజీగా ఉన్నాడు. చివరి షెడ్యూల్​ జరుపుకుంటోంది. ఇందులో ధర్మ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్లుగా వేదిక, సోనాల్ చౌహాన్ నటించారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించాడు. వచ్చే నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'అలీకి బాలయ్య వార్నింగ్​- ఈ ఫొటో వెయ్యకపోతే తల తీస్తా!'

ABOUT THE AUTHOR

...view details