తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిన్నారి అభిమాని మృతిపై బాలకృష్ణ భావోద్వేగం - balakrishna age

హీరో బాలకృష్ణ.. చిన్నారి అభిమాని గోకుల్ మృతి పట్ల​ సంతాపం వ్యక్తం చేశాడు. ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటా.. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాడు.

చిన్నారి అభిమాని మృతి నన్ను కలచివేసింది: బాలకృష్ణ

By

Published : Oct 18, 2019, 3:52 PM IST

Updated : Oct 18, 2019, 4:09 PM IST

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ.. చిన్నారి అభిమాని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశాడు. డెంగ్యూతో మరణించిన గోకుల్​కు సంతాపం ప్రకటించాడు. చిన్న వయసులో అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధ కలిగించిందని అన్నాడు. ఫేస్​బుక్​లో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

హీరో బాలకృష్ణ ఫేస్​బుక్ పోస్ట్

"మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. అలాంటి చిన్నారి అభిమాని గోకుల్. నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం, హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" -నందమూరి బాలకృష్ణ, హీరో

అభిమాని గోకుల్​తో హీరో బాలకృష్ణ

ప్రస్తుతం బాలకృష్ణ.. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోగా కనిపించనున్నాడు.

ఇది చదవండి: బాలయ్య దూకుడు.. పూరీతో మరో చిత్రం..!

Last Updated : Oct 18, 2019, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details