తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'60 ఏళ్లు వచ్చాయంటే నమ్మలేకపోతున్నా' - NBK106

హైదరాబాద్​లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్​ ఆసుపత్రిలో హీరో బాలకృష్ణ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. తనకు 60 ఏళ్లు వచ్చాయంటే నమ్మశక్యంగా లేదని అన్నారు.

'60 ఏళ్లు వచ్చాయంటే నమ్మలేకపోతున్నా'
హీరో బాలకృష్ణ

By

Published : Jun 10, 2020, 2:59 PM IST

Updated : Jun 10, 2020, 3:08 PM IST

బసవతారకం క్యాన్సర్​ ఆసుపత్రిలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు

సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చిన్నారులతో కలిసి బాలయ్య కేక్‌ కట్‌ చేశారు. అనంతరం వారికి పుస్తకాలు పంపిణీ చేశారు. రోగులకు, ఆసుపత్రి సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు.

వీలైనంత త్వరగా కరోనా మనల్ని వీడిపోవాలని కోరుకుంటున్నానని బాలకృష్ణ అన్నారు. తనకు అప్పుడే 60 ఏళ్లు వచ్చాయంటే నమ్మశ్యకంగా లేదని చెప్పారు. వైద్యులు, వెద్యేతర సిబ్బందితో పాటు పలువురు కృషి వలన క్యాన్సర్‌ ఆసుపత్రి అభివృద్ధి చెందిందని తెలిపారు. ఎందరో దాతల విరాళాలతో క్యాన్సర్‌ రోగులకు మంచి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

బసవతారకం క్యాన్సర్​ ఆసుపత్రిలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు
తల్లిదండ్రులకు నమస్కరిస్తున్న బాలకృష్ణ

అభిమానులు, ప్రేక్షక దేవుళ్ల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని... కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రతి ఒక్కరు ప్రభుత్వ, వైద్య నిపుణుల సూచనలు, సలహాలు పాటించాలని బాలకృష్ణ కోరారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 10, 2020, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details