కరోనా ప్రభావంతో లాక్డౌన్ విధించడం వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని కట్టడి చేయడం సహా సినీ పరిశ్రమలోని వేతన కార్మికులకు ఆదుకునేందుకు హిందూపుర్ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ ముందుకొచ్చాడు. రూ.కోటి 25 లక్షలు విరాళం ప్రకటించాడు. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు, కరోనా క్రైసిస్ ఛారిటీ రూ.25 లక్షలు ఇస్తున్నట్లు తెలిపాడు. సంబంధిత చెక్‌ను సీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సి.కల్యాణ్‌కు అందజేశాడు.
నందమూరి బాలకృష్ణ విరాళం.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ - cinema news
హీరో నందమూరి బాలకృష్ణ.. రూ.కోటి 25 లక్షలు విరాళం ప్రకటించాడు. కరోనా క్రైసిస్ ఛారిటీకి సాయం చేయడంపై ట్విట్టర్లో బాలయ్యకు ధన్యవాదాలు చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి.
హీరో బాలకృష్ణ
ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కొవాలని బాలకృష్ణ అన్నాడు. కరోనాను అరికట్టటంలో మనందరం భాగస్తులం కావాలని పిలుపునిచ్చాడు.
అనంతరం బాలకృష్ణకు ధన్యవాదాలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశాడు. కష్టసమయంలో, ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే, మీరెప్పుడు తోడుంటారని ట్విట్టర్లో రాసుకొచ్చాడు.
Last Updated : Apr 3, 2020, 6:14 PM IST