తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్యలా డైలాగ్​లు ఎవరూ చెప్పలేరు: అల్లు అర్జున్ - alluarjun akhanda pre release event

Akhanda movie pre release event: నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన 'అఖండ' చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పలు విషయాలు పంచుకున్నారు.

allu arjun balayya
బాలయ్య-అల్లు అర్జున్

By

Published : Nov 27, 2021, 9:39 PM IST

Updated : Nov 28, 2021, 6:20 AM IST

Akhanda pre release event: బోయపాటి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'అఖండ' సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ఘనంగా జరిగింది. అల్లు అర్జున్​, దర్శకధీరుడు రాజమౌళి ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హైదరాబాద్​లోని శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త ట్రైలర్​ను విడుదల చేశారు హీరో అల్లు అర్జున్​. ఈ ప్రచార చిత్రంలో బాలయ్య డైలాగ్​లు, యాక్షన్​ అదిరిపోయింది.

అఖండ ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో అల్లు అర్జున్​తో చిత్రబృందం

"బాలకృష్ణ ఈ లెవల్​లో ఉండటానికి రెండు కారణాలు. సినిమాపై ఆయనకు ఉన్న ఆసక్తి, డిక్షన్​. ఆయనలా డైలాగ్​లు ఎవరూ చెప్పలేరు. సీనియర్​ ఎన్టీఆర్​ తర్వాత ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. బాలయ్య ఎప్పుడు రియాలిటీగా ఉంటారు. కల్మషం లేని వ్యక్తి. ఆయనలో నాకు నచ్చే క్వాలిటీ అదే. అందుకే ఆయనకు ఇంత పెద్ద ఫ్యాన్ ​ఫాలోయింగ్​ ఉంది.​ 'అఖండ' సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా తెలుగు చిత్రపరిశ్రమకు వెలుగునివ్వాలని ఆశిస్తున్నా. బోయపాటి శ్రీను గారంటే చాలా ఇష్టం. 'భద్ర' సినిమా నేను చేయాల్సింది. కానీ ఆర్య ఉండటం వల్ల అది కుదరలేదు. బోయపాటి కెరీర్​ చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇష్టపడే వ్యక్తుల్లో ఆయనొకరు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ట్రైలర్​ చూస్తుంటే అర్థమైపోయింది.. సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అని. ప్రగ్యా జైస్వాల్​కు ఈ సినిమా కెరీర్​లో మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. శ్రీకాంత్​ నాకు అన్నయ్యలాంటివారు. ఇక నుంచి మీరు కొత్త శ్రీకాంత్​ను చూస్తారు. ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమాను ప్రేమించినంతగా.. ప్రపంచంలో ఏ ప్రేక్షకులు కూడా ఏ సినిమాను తెలుగు వారిలాగా ప్రేమించలేరు. జై బాలయ్య.

-అల్లుఅర్జున్​, హీరో

బాలయ్య-అల్లు అర్జున్

ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ప్రగ్యా హీరోయిన్​గా చేసింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. మిర్యాల రవీందర్​రెడ్డి నిర్మించారు.


ఇదీ చూడండి: బాలయ్య ఓ ఆటమ్ బాంబు: రాజమౌళి

Last Updated : Nov 28, 2021, 6:20 AM IST

ABOUT THE AUTHOR

...view details