తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో అజిత్​కు మళ్లీ గాయం.. ప్రస్తుతం చెన్నైలో! - అజిత్ వార్తలు

'వాలిమై' సినిమా షూటింగ్​లో కోలీవుడ్​ టాప్ హీరో అజిత్​కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం బాగానే ఉన్నారని, ప్రస్తుతం చెన్నైలోని తన ఇంట్లో ఉన్నారని సమాచారం.

HERO AJITH INJURED IN SETS OF VALIMAI
హీరో అజిత్​కు మళ్లీ గాయం.. ప్రస్తుతం చెన్నైలో!

By

Published : Nov 20, 2020, 12:25 PM IST

Updated : Nov 20, 2020, 12:42 PM IST

అగ్ర కథానాయకుడు అజిత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వాలిమై'. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ, లాక్‌డౌన్‌ అనంతరం ఇటీవల హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది. అజిత్‌పై పలు కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్‌ సీక్వెన్స్‌ను తీస్తున్నారు. అయితే, పదిరోజుల క్రితం యాక్షన్‌ సీన్స్​ తీస్తుండగా ప్రమాదవశాత్తు అజిత్‌కు స్వల్ప గాయాలయ్యాయని, చికిత్స తీసుకుంటూ ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే అంతకు ముందు కూడా ఇదే తరహాలో షూటింగ్​లు గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తి కావడం వల్ల ఆయన ఇంటికెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం అజిత్ ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది.

మరికొన్ని రోజుల్లో 'వాలిమై' మరో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బోనీకపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో హ్యుమా కూరేషి, టాలీవుడ్‌ నటుడు కార్తికేయ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు అందిస్తున్నారు.

Last Updated : Nov 20, 2020, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details