హిందీ స్టార్ హీరో అజయ్ దేవగణ్.. ప్రతిష్ఠాత్మక 'ఆర్ఆర్ఆర్' సినిమా సెట్లోకి అడుగుపెట్టేశాడు. దర్శకధీరుడు రాజమౌళితో అతడున్న ఫొటోలను చిత్రబృందం పంచుకుంది. అయితే ఇందులో ఎలాంటి పాత్రలో అజయ్ కనిపించనున్నాడా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' సెట్లోకి బాలీవుడ్ స్టార్ హీరో - ENTERTAINMENT NEWS
ప్రముఖ కథానాయకుడు అజయ్ దేవగణ్.. 'ఆర్ఆర్ఆర్' సెట్లోకి వచ్చేశాడు. ఆ ఫొటోలను చిత్రబృందం విడుదల చేసింది.
'ఆర్ఆర్ఆర్' సెట్లో అజయ్ దేవగణ్
ఈ సినిమాలో రామ్‌చరణ్-జూనియర్ ఎన్టీఆర్ హీరోలు. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీమ్‌గా కనిపించునున్నారు. వీరి సరసన ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో కీలక సన్నివేశాలను తీస్తున్నారు.
ఇద్దరు సూపర్ హీరోల కలిస్తే ఎలా ఉంటుంది అనే కల్పిత కథతో ఈ సినిమాను తీస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నాడు. డీవీవీ దానయ్య దాదాపు రూ.350 కోట్లతో నిర్మిస్తున్నారు.
Last Updated : Feb 17, 2020, 8:23 PM IST