అడివి శేష్ 'మేజర్'(major movie release date) సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. 2022 ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలియజేస్తూ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. '120రోజులు షూటింగ్, 8 సెట్లు, 75 లొకేషన్స్, మూడు భాషలు' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. శశికిరణ్ తిక్క దర్శకుడు. సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేశ్‌బాబు(mahesh babu new movie), సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలై ఈ చిత్ర పోస్టర్లు అభిమానులను సినిమాపై ఆసక్తిని రేకేస్తున్నాయి.
రిలీజ్ డేట్‌తో 'మేజర్'.. 'అన్నాత్తే' నుంచి మరో సాంగ్ - rajnikanth annatthe
'మేజర్' సినిమా(major movie release date) రిలీజ్ డేట్ ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. కాగా, రజనీకాంత్ నటించిన 'అన్నాత్తే' నుంచి మరో పాట విడుదలై ఆకట్టుకుంటోంది.
సినిమా అప్డేట్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే'(rajinikanth annaatthe movie) సినిమాలోని 'ఆహా కళ్యాణం' పాట విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్(keerthy suresh) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న థియేటర్లలోకి రానుందీ సినిమా. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ సహా కొన్ని సాంగ్స్ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: టాప్ లెస్ ఫొటోలతో షాక్‌కు గురిచేసిన స్టార్ హీరోయిన్లు!