'ప్రేమ కావాలి' చిత్రంతో సినీ అరంగేట్రం చేసి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆది సాయికుమార్. తాజాగా ఈ కథానాయకుడు పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ క్రైం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో బాలవీర్. యస్ వెండితెరకు దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
పాన్ ఇండియా దిశగా 'ఆది' అడుగులు - latest aadi movies updates
సాయికుమార్ తనయుడు హీరో ఆది త్వరలో పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు.

పాన్ ఇండియా దిశగా ఆది అడుగులు
ఈ చిత్రాన్ని ఎస్.వి.ఆర్ సంస్థ నిర్మిస్తోంది. దీన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తోంది చిత్రబృందం. దర్శక నిర్మాతలు రెండేళ్ల పాటు ప్రీ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించారు. ఇటీవలే 'ఆపరేష్ గోల్డ్ ఫిష్' చిత్రంతో వచ్చిన ఆది..బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాడు. ప్రస్తుతం 'బ్లాక్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఇదీ చూడండి:బిగ్‌బీ ఇంటి నుంచి మరో హీరో!
Last Updated : Jul 11, 2020, 8:58 AM IST