తెలంగాణ

telangana

ETV Bharat / sitara

''ఆచార్య'లో ఆ సీన్ రీషూట్ చేశాం' - ఆచార్య షూట్​లో సోనూసూద్

లాక్​డౌన్ సమయంలో ఎంతోమందికి సాయం చేసి ప్రశంసలు అందుకున్నారు నటుడు సోనూసూద్. ప్రస్తుతం ఆయన చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య' షూటింగ్​లో పాల్గొన్నారు. తాజాగా అక్కడ జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Heres Why Chiranjeevi Refused to Beat up Hero Sonu Sood in an Action Scene
'చిరు సార్.. నన్ను చూసి ఇబ్బందిపడ్డారు'

By

Published : Dec 20, 2020, 2:08 PM IST

లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతోమందికి తన వంతు సాయం అందించి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నటుడు సోనూసూద్‌. తెలుగులో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించిన సోనూ.. రియల్‌ లైఫ్‌లో మాత్రం హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'ఆచార్య' చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సోనూ ప్రతినాయకుడి లక్షణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలపాటు వాయిదా పడిన 'ఆచార్య' చిత్రీకరణ కొన్నిరోజుల క్రితం తిరిగి పట్టాలెక్కింది. తాజా షెడ్యూల్‌లో భాగంగా సోనూసూద్‌-చిరంజీవిలపై ఇటీవల కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. అయితే, చిత్రీకరణ సమయంలో సోనూని కొట్టడానికి చిరు ఎంతో ఇబ్బందిపడ్డారట. ఈ విషయాన్ని తాజాగా సోనూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"ఇప్పుడు నాకు హీరో పాత్రలకు అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నాలుగు అద్భుతమైన స్ర్కిప్ట్‌లు నా వద్దకు వచ్చాయి. విలన్‌ పాత్రలు చేయను. కాబట్టి కొత్త ఆరంభానికి స్వాగతం పలుకుదాం. ఇటీవల నేను 'ఆచార్య' షూట్‌లో పాల్గొన్నా. చిరు సర్‌కి నాకూ మధ్య యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరించారు. షూట్‌ సమయంలో చిరు నా వద్దకు వచ్చి.. 'ఎంతోమందికి సేవలు అందించి ప్రజల హృదయాల్లో మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నావు. యాక్షన్‌ సీన్స్‌లో నిన్ను కొట్టాలంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. ఒకవేళ నేను నిన్ను కొడితే ప్రజలు నాపై కోపంగా ఉంటారు' అని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో చిరు నాపై కాలు పెట్టాల్సి ఉంటుంది. దాన్ని కూడా మేము రీషూట్ చేశాం" అని సోనూసూద్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details