తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రణ్​బీర్​, షారుక్​ సినిమాలు సెట్స్​పైకి అప్పుడే! - ranbir parineti film

తమిళ దర్శకుడు అట్లీ-హీరో షారుక్​ ఖాన్​ కాంబోలో రానున్న సినిమా షూటింగ్​ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'యానిమల్‌' అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది.

ranbir
రణ్​బీర్​

By

Published : Mar 27, 2021, 5:42 PM IST

తమిళ దర్శకుడు అట్లీ-షారుక్​ ఖాన్‌ కాంబోలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రం శంకి (వర్కింగ్​ టైటిల్​)పేరుతో రూపొందుతోంది. అయితే ఈ చిత్రం షారుక్​ ప్రస్తుతం నటిస్తున్న 'పఠాన్'​ తర్వాత సెట్స్​పైకి వెళ్లనుందని సమాచారం. ఆగస్టు 21 ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని సోషల్​మీడియాలో ట్రెండింగ్​ అవుతోంది.

షారుక్​,అట్లీ

ప్రముఖ తెలుగు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'యానిమల్‌'. పరిణీతి చోప్రా కథానాయిక. అనిల్‌కపూర్‌ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇందులో బాబీ డియోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌.. భూషణ్‌ కుమార్‌ నిర్మాణంలోనే రూపొందుతున్న మరో చిత్రం 'లవ్‌ రంజన్‌', బ్రహ్మాస్త్ర సినిమాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: షారుక్​‌- అట్లీ సినిమాకు రెహమాన్‌ సంగీతం!

ABOUT THE AUTHOR

...view details