దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'తలైవి'. ఏఎల్ విజయ్ దర్శకుడు. ఈ సినిమా తమిళ, హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా, తాజాగా మరోలుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కంగనా నాట్య భంగిమలో ఉన్న ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తొలుత జయలలిత సినీ జీవితానికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు ఈ ఫొటో చూస్తే అర్థమవుతోంది.
ఆకట్టుకుంటోన్న 'తలైవి' మరో లుక్ - జయలలిత
భారతీయ సినీపరిశ్రమలోనే కాకుండా.. తమిళ రాజకీయాల్లో వెలుగు వెలిగిన జయలలిత జీవిత చరిత్రతో 'తలైవి' చిత్రం తెరకెక్కుతోంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
'తలైవి' చిత్రం నుంచి మరో లుక్
నటిగా, రాజకీయ నాయకురాలిగా, ముఖ్యమంత్రిగా జయలలిత తమిళ రాజకీయాల్లోనే కాదు.. భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. 'అమ్మ'గా ఆ రాష్ట్ర ప్రజలు పిలుచుకునే 'తలైవి' జీవిత కథ ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఆమె జీవిత కథ ఆధారంగా రమ్యకృష్ణ కీలక పాత్రలో వెబ్‌సిరీస్ 'క్వీన్' రూపొంది విడుదలైంది. ఇక 'తలైవి' జూన్ 26, 2020న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి...వైరల్: సారా, కార్తీక్ లెమన్ స్పూన్ డాన్స్
Last Updated : Feb 28, 2020, 10:10 PM IST