మెగా డాటర్ నిహారిక పెళ్లి.. కుటుంబసభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో పవన్‌కల్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్య కూడా కనువిందు చేశారు. అయితే ఈ పెళ్లికి ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ హాజరుకాలేదు. దీంతో ఆమెకు ఆహ్వానం అందలేదని వార్తలు జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలకు ఆమె చెక్ పెట్టారు. తనకు ఆహ్వానం అందిందని చెప్పారు. పెళ్లి రోజు షూటింగ్ ఉండటం వల్లే తాను రాలేకపోయానని స్పష్టం చేశారు.
'నిశ్చయ్' పెళ్లికి అందుకే రాలేదు: రేణు దేశాయ్
నిహారిక-చైతూ పెళ్లికి తాను ఎందుకు హాజరుకాలేకపోయానో వివరించారు నటి రేణూదేశాయ్. ఆ రోజు షూటింగ్ ఉండటం వల్లే రాలేకపోయానని స్పష్టం చేశారు.
రేణూ దేశాయ్
చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ మళ్లీ సినిమాల్లో నటించడానికి ఇటీవల సిద్ధమయ్యారు. ప్రస్తుతం 'ఆద్య' పేరుతో తెరకెక్కనున్న పాన్ఇండియా చిత్రంలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు.
ఇదీ చూడండి : రేణూ దేశాయ్ ఈజ్ బ్యాక్.. వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్