ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ 20వ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ హీరో హీరోయిన్లు, ప్రముఖులు హాజరై సందడి చేశారు. 2019 సంవత్సరానికి గాను ఐఫా-2019 ఉత్తమ నటిగా 'రాజీ' చిత్రంలో నటనకు ఆలియా భట్ ఎంపికైంది. 'పద్మావత్' చిత్రంలో నటనకు రణ్వీర్ సింగ్ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు.
ఉత్తమ దర్శకుడిగా 'అంధాధున్' చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ అవార్డు అందుకున్నాడు. 'ఉరి' చిత్రంలో నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విక్కీ కౌశల్.. 'సంజూ' చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడి పురస్కారం కైవసం చేసుకున్నాడు.
ఐఫా బెస్ట్ డెబ్యూ మేల్ అవార్డు 'ధడక్' నటుడు ఇషాన్ ఖత్తర్‌కు, ఐఫా బెస్ట్ డెబ్యూ ఫిమేల్ అవార్డు 'కేదార్‌నాథ్' నటి సారా అలీఖాన్‌కు దక్కాయి. ఐఫా-2019ఉత్తమ చిత్రం అవార్డు ఆలియా భట్, విక్కీ కౌశల్‌లు నటించిన 'రాజీ' చిత్రానికి లభించింది. రెండు శతాబ్దాల్లో ఉత్తమ చిత్రంగా 'కహో నా ప్యార్ హై' ఎంపికైంది.
ఐఫా అవార్డుల పూర్తి వివరాలు
- ఉత్తమ చిత్రం - రాజీ
- ఉత్తమ దర్శకుడు - శ్రీరామ్ రాఘవన్
- ఉత్తమ నటుడు - రణ్వీర్ సింగ్ (పద్మావత్)
- ఉత్తమ నటి - ఆలియా భట్ (రాజీ)
- ఉత్తమ సహాయ నటి - అదితీ రావు హైదరీ (పద్మావత్)
- ఉత్తమ సహాయ నటుడు - విక్కీ కౌశల్ (సంజూ)
- ఉత్తమ డెబ్యూ నటి - సారా అలీ ఖాన్ (కేదార్‌నాథ్)
- ఉత్తమ డెబ్యూ నటుడు - ఇషాన్ ఖత్తర్ (ధడక్)
- ఉత్తమ సంగీత దర్శకుడు - అర్మాన్ మాలిక్, గురు రాధ్వా, రోచక్ కోహ్లీ, సౌరభ్-వైభవ్, జాక్ నైట్ (సోనూ కి టీటు కి స్వీటీ)
- ఉత్తమ గేయ రచయిత - అమితాబ్ భట్టాచార్య (ధడక్)
- ఉత్తమ గాయకుడు - అర్జీత్ సింగ్ ( 'రాజీ'లోని 'యే వతన్' పాట)
- ఉత్తమ గాయని - హర్షదీప్ కౌర్, విభా సరఫ్ ( 'రాజీ'లోని 'దిల్బరో' పాట)
- ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా - సరోజ్ ఖాన్, ఇష్తియాక్ అహ్మద్