మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్ (MAA Elections 2021) కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కేంద్రంగా జరుగుతున్న పోలింగ్‌లో సీనియర్, జూనియర్ నటీనటులు పాల్గొంటున్నారు. అయితే, 'మా' సభ్యులను ప్రలోభపెట్టేలా పోలింగ్ (MAA Elections 2021) కేంద్రం లోపల కూడా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రకాశ్‌రాజ్- మంచు విష్ణు ప్యానల్స్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పోలింగ్ కేంద్రంలోకి బయటి వ్యక్తులు వచ్చారని నరేశ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్, నరేశ్ మధ్య.. నువ్వెంతంటే నువ్వెంత అనేలా వాగ్వాదం జరిగింది. గేటు బయట మాత్రమే ప్రచారం చేసుకోవాలంటూ ఇరు ప్యానల్స్ సభ్యులు వాదించుకున్నారు. ఈ పరిస్థితుల్లో పది నిమిషాల పాటు పోలింగ్‌ను నిలిపివేశారు అధికారులు.
దీంతో పోలీసులు కలుగచేసుకుని వివాదం సద్దుమణిగేలా చేశారు. వాళ్లందర్నీ అక్కడి నుంచి పంపించివేశారు. ఈ మొత్తం వ్యవహారం తెలుసుకున్న మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేస్తున్నారు' అని ఆయన అన్నట్లు తెలుస్తోంది.
సీసీటీవీ ఫుటేజీ పరిశీలన