తెలంగాణ

telangana

By

Published : Oct 27, 2021, 5:39 PM IST

Updated : Oct 27, 2021, 5:55 PM IST

ETV Bharat / sitara

ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ గురువారానికి వాయిదా

డ్రగ్స్ కేసులో(Aryan khan bail case) అరెస్టయిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్​ ఖాన్​ బెయిల్​కు సంబంధించిన హైకోర్టు విచారణ గురువారానికి(అక్టోబర్​ 28) వాయిదా పడింది. ఆర్యన్ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

aryan khan
ఆర్యన్​ ఖాన్​

క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో(Aryan khan bail case) అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి (అక్టోబర్ 28) వాయిదా పడింది. ఆర్యన్‌ తరఫున మాజీ అటార్నీ జనరల్‌, ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, మరో లాయర్​ సతీశ్‌మనేషిండే బాంబే హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు ముకుల్ రోహత్గీ. అరెస్టు వేళ ఆర్యన్‌పై కుట్ర అభియోగాలు లేవని చెప్పారు.

సుదీర్ఘంగా కొనసాగిన వాదనల అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్యన్‌ ఈరోజు రాత్రి కూడా జైలులోనే ఉండనున్నారు. అక్టోబర్‌ 3న అరెస్టయిన ఆర్యన్‌ ఖాన్‌.. దాదాపు రెండు వారాల నుంచి జైలులోనే ఉంటున్నాడు. కాగా, రేపు(అక్టోబర్​ 28) ఎన్‌సీబీ తరఫున వాదనలు వినిపించనున్నారు ఏఎస్‌జీ.

ఇదీ చూడండి: ఆర్యన్​ ఖాన్​ కేసులో కొత్త ట్విస్ట్.. విడిపించేందుకు డీల్​!​

Last Updated : Oct 27, 2021, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details