తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కేజీఎఫ్ 2' టీజర్​పై అభ్యంతరం.. యష్​కు నోటీసులు - KGF YASH LATEST NEWS

ఇటీవల విడుదలైన 150 మిలియన్లకు చేరువగా ఉన్న 'కేజీఎఫ్ 2' టీజర్​పై కర్ణాటక ఆరోగ్య శాఖ అభ్యంతర వ్యక్తం చేసింది. యష్ పొగ తాగే సీన్స్​ వెంటనే తొలగించాలని అతడితో పాటు చిత్రబృందానికి నోటీసులు జారీ చేసింది.

Health Department objected Smoking visuals in KGF-2: Issued notice to Actor Yash
'కేజీఎఫ్ 2' టీజర్​పై అభ్యంతరం.. యష్​కు నోటీసులు

By

Published : Jan 13, 2021, 3:44 PM IST

'కేజీఎఫ్ -2' హీరో యష్​కు.. కర్ణాటక ఆరోగ్య శాఖ, యాంటీ టొబాకో సెల్​ నోటీసులు జారీ చేసింది. టీజర్​లోని పొగ తాగే సన్నివేశాలపై అభ్యంతరం తెలిపింది. వెంటనే వాటిని తొలగించాలని స్పష్టం చేసింది.

టీజర్​లో యష్ పొగ తాగే సీన్స్, టొబాకో 2003 చట్టం​లోని సెక్షన్ 5 నిబంధనల అతిక్రమణ కిందకు వస్తాయని యాంటీ టొబాకో సెల్​ చెప్పింది. ఆన్​లైన్​లో ప్రస్తుతమున్న టీజర్​లోని ఆ సన్నివేశాల్ని, పోస్టర్​లను తక్షణమే తీసేయాలని చిత్రబృందానికి ఆదేశాలు జారీ చేసింది.

కథానాయకుడు యష్​కు అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారని, అందులో యువత ఎక్కువని నోటీసులో కర్ణాటక ఆరోగ్య శాఖ పేర్కొంది. సినిమాలో పొగ తాగే సన్నివేశాల వల్ల యువత పెడదోవ పట్టే అవకాశముందని తెలిపింది. దాని వల్ల క్యాన్సర్​, సంబంధిత వ్యాధులు వస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఓ లేఖను యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిర్గాందర్, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్​కు పంపించింది.

ఇది చదవండి:'కేజీఎఫ్ 2' టీజర్​ రికార్డు.. 24 గంటల్లోనే ఆ ఘనత

ABOUT THE AUTHOR

...view details