తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా వేళ షూటింగ్​లు.. నటీనటుల్లో భయం! - టాలీవుడ్ వార్తలు

'లైట్స్', 'కెమెరా'లు సిద్ధమవుతున్నా, 'యాక్షన్' చేసేందుకు మాత్రం పలువురు బాలీవుడ్​ నటులు వెనుకంజ వేస్తున్నారు. షూటింగ్​లు ప్రారంభమవుతున్నా సరే, తమకు ఆరోగ్యమే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

కరోనా వేళ షూటింగ్​లు.. నటీనటుల్లో భయం భయం
షూటింగ్​లకు రానంటున్న నటీనటులు

By

Published : Jun 20, 2020, 6:21 PM IST

లాక్​డౌన్​లో సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో టీవీ సీరియల్స్​తో పాటు సినిమా షూటింగ్​లు మొదలయ్యాయి. ఆంధ్రాలోనూ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో అనుమతులు మంజూరు చేసింది. అయితే కొందరు బాలీవుడ్​ నటీనటులు మాత్రం తమకు ఆరోగ్యమే తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. సెట్స్​లోకి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు.

పలువురు బాలీవుడ్​ నటీనటులు

"నేనింకా షూటింగ్​లకు సిద్ధం కాలేదు. ఒకవేళ నేను వెళ్తే చాలామంది జీవితాల్ని ప్రమాదంలోకి నెట్టినదాన్ని అవుతానేమో?. ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. దీనితోపాటు వర్షకాలం వచ్చేసింది. అంటువ్యాధులూ ఎక్కువగా వ్యాపించే అవకాశముంది. పని చేయాలి, అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నింటికన్నా ఆరోగ్యమే నాకు తొలి ప్రాధాన్యం" -మృణాల్ ఠాకుర్, 'సూపర్​ 30' ఫేమ్

చిత్రీకరణ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పిన నటుడు వరుణ్ శర్మ.. అన్నీ భద్రంగా ఉన్నాయన్నప్పుడే సెట్​కు వెళ్తానని అన్నాడు.

"రోజువారీ పనుల్లోకి వెళ్లాలని అందరూ అనుకుంటున్నారు. నేనూ కెమెరా ముందుకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాను. అయితే అంతా భద్రంగా ఉందని తెలిసిన తర్వాతే సెట్​లోకి అడుగుపెడతాను"

-వరుణ్ శర్మ, నటుడు

దర్శకుడు సంజయ్ గుప్తా మాట్లాడుతూ.. తన సినిమా 'ముంబయి సాగా' చిత్రీకరణ, వచ్చే నెల నుంచి రామోజీ ఫిల్మ్​సిటీలో మొదలుపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. కొద్దిమంది సభ్యులతో మాత్రమే షూటింగ్​ జరుపుతామని అన్నారు. నటులు, సాంకేతిక నిపుణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

అయితే ఇటీవలే ఔట్​డోర్​ షూటింగ్​లో పాల్గొనడం సహా డబ్బింగ్ చెప్పిన నటి హీనాఖాన్.. తన అనుభవాల్ని పంచుకుంది. బయట వాతావరణం తనకు అంత సురక్షితంగా అనిపించలేదని పేర్కొంది. అయితే నటులకు వేరేమార్గం లేదని చెప్పిన హీనా.. ప్రేక్షకుల్ని అలరించేందుకు తాము రిస్క్​ తీసుకోక తప్పదని, పరిస్థితులు ఎలా ఉన్నాసరే నటనను కొనసాగించాల్సిందేనని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details