బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుటుంబం నుంచి మరొకరు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. సైఫ్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ త్వరలోనే సినిమాల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని సైఫ్ స్పష్టం చేశాడు. అయితే ఇబ్రహీ ఏ సినిమాతో రానున్నాడో చెప్పలేదు.
"ఇబ్రహీం సినిమాల్లోకి వచ్చే విధంగా కెరీర్ను ప్రణాళిక చేసుకుంటున్నాడు. నా పిల్లలంతా చిత్రరంగాన్ని వృత్తిగా ఎంచుకోవాలని నేను కోరుకుంటాను. పనిచేయడానికి సినిమా రంగం ఎంతో ఉత్తమమైన ప్రదేశం. నేను 17-18ఏళ్ల వయసులో పక్కదారి పడుతున్న సమయంలో నటన నన్ను కాపాడింది. బాధ్యతను గుర్తుచేసింది. నాకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ వృత్తి నాకు కావాల్సిందానికన్నా ఎక్కువే ఇచ్చింది. ఎంతో సంతృప్తి చెందాను."