తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రకుల్​ పిటిషన్​పై కేంద్రానికి హైకోర్టు నోటీసులు - Rakul Preet Singh's plea

డ్రగ్స్ కేసులో తనపై వస్తున్న మీడియా కథనాలను నిలిపివేయాలంటూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది నటి రకుల్ ప్రీత్ సింగ్. ఈ వ్యవహారంపై కేంద్రానికి, ప్రెస్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియాకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

నాపై వస్తున్న కథనాలు ఆపేయాలి: హైకోర్టుకు రకుల్
నాపై వస్తున్న కథనాలు ఆపేయాలి: హైకోర్టుకు రకుల్

By

Published : Sep 17, 2020, 11:45 AM IST

Updated : Sep 17, 2020, 2:59 PM IST

రియా చక్రవర్తికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని సినీ నటి రకుల్ ప్రీత్‌ సింగ్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తనపై ఎటువంటి కథనాలు మీడియాలో ప్రసారం చేయకుండా సమాచార శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది.

రకుల్​ పిటిషన్​పై అభిప్రాయం చెప్పాలని ఆదేశిస్తూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ, ప్రసార భారతి, ప్రెస్ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియాకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. రకుల్​కు సంబంధించి కథనాలు ప్రచురించడంలో మీడియా స్వీయ నియంత్రణ పాటిస్తుందని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

అక్టోబర్​ 15న ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణ జరగనుంది.

Last Updated : Sep 17, 2020, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details