'గుంజన్ సక్సేనా - ది కార్గిల్ గర్ల్' చిత్రాన్ని భారత వైమానిక దళంపై దురభిప్రాయం కలిగేలా తీశారని కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నెట్‌ఫ్లిక్స్‌లో చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని పిటిషన్లో కోరగా, ఆ విజ్ఞప్తిని కోర్టు నిరాకరించింది.
ఓటీటీలో విడుదల కాకముందే కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని పిటిషనర్‌కు జస్టిస్ రాజీవ్ సూటి ప్రశ్న వేశారు. సినిమా ఇప్పటికే ప్రసారం అవుతుండటం వల్ల ప్రదర్శన నిలిపివేయడం కుదరదని తేల్చి చెప్పారు.
లింగవివక్ష లేదు
'గుంజన్ సక్సేనా' చిత్రంలో భారత వైమానిక దళంలో లింగవివక్ష ఉందనే విధంగా సన్నివేశాలు రూపొందించారని, అందులో ఏమాత్రం నిజం లేదని కేంద్రం తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ కోర్టుకు తెలిపారు. దీనిపై చిత్ర నిర్మాణసంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది.
గుంజన్ స్పందన కావాలి
భారత వైమానిక దళ మాజీ పైలట్, లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనాను కూడా ఈ పిటిషన్లో చేర్చి.. కేంద్రం ఆరోపణలపై స్పందన కోరుతూ, నోటీసు జారీ చేయాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ చిత్రం ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది.