లాక్‌డౌన్ కాలాన్ని స్టార్ కథానాయిక సమంత చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది. కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల నుంచి పాఠం నేర్చుకున్నానని, అందుకే ఇంట్లోకి కావాల్సిన ఆహారాన్ని తానే స్వయంగా పండిస్తున్నట్లు తెలిపింది. మిద్దెపై వ్యవసాయం చేస్తున్న ఫొటోలు, వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ వారం సమంత ఫుడ్ మెనూ ఏంటో తెలుసా! - క్యారెట్లను పండించిన నటి సమంత
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమతమైన నటి సమంత మిద్దె వ్యవసాయం చేస్తోంది. అందులో భాగంగా ఇంటిపై కొన్ని కూరగాయలతో పాటు పూలమొక్కలను నాటింది. ఇంట్లోకి కావాల్సిన ఆహారాన్ని తానే స్వయంగా పండిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది. తాజాగా ఆమె పండించిన క్యారెట్లను చూపిస్తూ.. ఈ వారంతం వరకు క్యారెట్‌తోనే వంటకాలను చేయనున్నట్లు తెలిపింది.
![ఈ వారం సమంత ఫుడ్ మెనూ ఏంటో తెలుసా! Have You seen This week Samantha Food menu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8554171-1019-8554171-1598362056880.jpg)
ఈ వారం సమంత ఫుడ్ మెనూ ఏంటో తెలుసా!
"ఈ వారం మా ఇంట్లో వంటలకు సంబంధించిన జాబితా ఇదే.. క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ ఫ్రై, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోసా, క్యారెట్ కేక్" అంటూ క్యారెట్లను చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేసింది సామ్.
సమంత చేసిన పోస్ట్‌కు సెలబ్రిటీలు అనుపమా పరమేశ్వరన్, నమ్రతా శిరోద్కర్, వెన్నెల కిషోర్, అనసూయ, చిన్మయి శ్రీపాద, విమలా రామన్, కృతి కర్బంద, నందినీ రెడ్డి తదితరులు 'వావ్', 'సూపర్' అంటూ కామెంట్లు పెట్టారు.