బాలీవుడ్, దక్షిణాది చిత్రాలతో దూసుకెళ్తోంది తాప్సీ (Tapsee). ప్రస్తుతం ఈ నటి 'హసీన్ దిల్‌రుబా'(Haseen Dillrba) అనే సినిమాలో నటిస్తోంది. కరోనా కారణంగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. జులై 2న నెట్‌ఫ్లిక్స్ (Haseen Dillrba on Netflix) వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తాప్సీ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై ఫస్ట్‌లుక్ విడుదల చేసిన దగ్గర నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో తాప్సీ 'హసీన్ దిల్‌రుబా' - నెట్‌ఫ్లిక్స్‌లో తాప్సీ హసీన్ దిల్‌రుబా
తాప్సీ (tapsee), విక్రాంత్ మాస్సే ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'హసీన్ దిల్‌రుబా'(Haseen Dillrba). కరోనా కారణంగా నేరుగా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైందీ సినిమా.
హసీన్ దిల్‌రుబా
ఈ చిత్రంలో తాప్సీకి జోడిగా విక్రాంత్ మాస్సే నటిస్తున్నాడు. గతేడాది తాప్సీ 'మిషన్ మంగళ్', 'సాండ్ కి ఆంఖ్' సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ జీతాధారంగా వస్తున్న 'శభాష్ మిథు' చిత్రంలోనూ ప్రధాన పాత్రలో కనిపించనుందీ భామ.