తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విశాల్​ వివాహం ఆగిపోయిందా?... కారణమదేనా!? - అనీశా

తమిళంతోపాటు తెలుగుభాషలోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్‌. ఈ ఏడాది మార్చి 10న విశాల్‌కు హైదరాబాద్‌కు చెందిన అనీశా అనే అమ్మాయితో నిశ్చితార్థమైంది. అప్పటి నుంచి వీరికి సంబంధించిన ఫొటోలను అనీశా సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తుండేది. కానీ ఇటీవల ఈ వీరి ఫొటోలన్నింటినీ ఆమె డిలీట్‌ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

విశాల్​-అనీశాల వివాహం ఆగిపోయిందా?

By

Published : Aug 22, 2019, 12:58 PM IST

Updated : Aug 22, 2019, 1:12 PM IST

తమిళ నటుడు విశాల్-అనీశాలకు మార్చి 10న నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నాక టర్కీకి కూడా వెళ్లొచ్చారు. విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం టర్కీలోనే షూటింగ్‌ జరిగింది. అనీశాను కూడా విశాల్‌ అక్కడికి తీసుకెళ్లారు. వీరికి సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు అనీశా సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తుండేది. ఇటీవల ఆ ఫొటోలన్నీ డిలీట్​ చేయడం వల్ల వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వీరి బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిశ్చితార్థం గురించి వస్తున్న వార్తలపై అటు విశాల్ గానీ, ఇటు అనీశాగానీ స్పందించలేదు.

అనీశా ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌ రెడ్డి’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ‘అయోగ్య’ (‘టెంపర్‌’ తమిళ రీమేక్‌) సినిమా చిత్రీకరణ వైజాగ్‌లో జరుగుతున్న సమయంలో అనీశాతో తనకు పరిచయం ఏర్పడిందని విశాల్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తర్వాత అది ప్రేమగా మారిందని, ఆ దేవుడు తన కోసం అనీశాను పంపారని పేర్కొన్నాడు.

Last Updated : Aug 22, 2019, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details