తెలంగాణ

telangana

By

Published : Apr 10, 2020, 7:47 PM IST

ETV Bharat / sitara

మీటూ ఆరోపణలు వచ్చిన ఆ నిర్మాతకు క్వారంటైన్​ విముక్తి

మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్​ నిర్మాత హార్వే వీన్​స్టీన్​.. క్వారంటైన్​ నుంచి బయటకొచ్చాడు. లైంగిక వేధింపులు, అత్యాచారం కేసుల్లో దోషిగా తేలి, ప్రస్తుతం 23 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

Harvey Weinstein survives fight against COVID-19
మీటు ఆరోపణల నిర్మాత క్వారంటైన్​ నుంచి విడుదల

కరోనా సోకిన హాలీవుడ్ ప్రముఖ​ నిర్మాత హార్వే వీన్​స్టీన్..​ 14 రోజుల క్వారంటైన్​ నుంచి విడుదలయ్యాడు. ప్రస్తుతం హార్వే ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు ఆయన ప్రతినిధి జూడా ఎంగల్​మేయర్ చెప్పారు. అయితే వైరస్​కు సంబంధించి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో చెప్పేందుకు నిరాకరించారు.

మీటూ ఆరోపణల్లో భాగంగా గత నెల 11న హార్వేకు 23 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇతడు దాదాపు 90 మంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2013లో న్యూయార్క్​ నగరంలోని ఓ హోటల్​లో ఓ నటిపై అత్యాచారం, 2006లో మిమి హలేయీపై లైంగిక దాడుల కేసుల్లో ఇతడిని దోషిగా తేల్చింది కోర్టు. అయితే శిక్ష వేసిన వారం రోజులకు సిటీ ప్రిజన్ రైకర్స్ ఐలాండ్​ జైలుకు తరలించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఇతడికి కరోనా పాజిటివ్​గా తేలింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నిర్బంధంలోనే ఉన్నాడు హార్వే.

ఇదీ చూడండి :'మనం ఒకటి రాస్తే దేవుడు మరో స్క్రిప్ట్ రాస్తాడు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details