'అవును' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు హర్షవర్ధన్ రాణె(36)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తానే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
'ఫిదా' సినిమా నటుడికి కరోనా - అవును సినిమా నటుడికి కరోనా
టాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ రాణెకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపాడు.
హర్షవర్ధన్ రాణె
"నాకు జ్వరం, కడుపు నొప్పి రావడం వల్ల ఆస్పత్రికి వెళ్లా. కొవిడ్ పరీక్ష కూడా నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఇప్పటి నుంచి 10 రోజుల పాటు నేను ఒంటరిగా ఉన్నట్లు అనుకోండి. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది" అని ట్వీట్ చేశాడు రాణె.
హర్షవర్ధన్ తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అతడు నటించిన 'తేయిష్' అక్టోబర్ 29న జీ5లో విడుదల కానుంది. 'అవును', 'అవును 2', 'మాయ', 'ఫిదా' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయస్థుడే.