తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్​తో తొలిసారి.. హరీశ్​తో మూడోసారి! - పవన్​ కొత్త సినిమా

పవన్​కల్యాణ్-హరీశ్ శంకర్​ కాంబినేషన్​లో రాబోయే సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రత్యేక బలం ఇవ్వాలని దర్శకుడు నిర్ణయించాడట. ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది.

Harish Shankar in plans to rope this heroine for Pawan film
పవన్​తో తొలిసారి.. హరీశ్​తో మూడోసారి!

By

Published : Feb 7, 2020, 7:12 AM IST

Updated : Feb 29, 2020, 11:50 AM IST

రీఎంట్రీలో పవన్​కల్యాణ్ వరుసగా సినిమాలు అంగీకరించాడు. 'పింక్' తెలుగు రీమేక్​తో పాటు, క్రిష్​తో ఓ పీరియాడికల్ చిత్రం చేస్తున్నాడీ కథానాయకుడు. వీటి తర్వాత హరీశ్ శంకర్​తో కలిసి పనిచేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పవన్​తో తొలిసారి.. హరీశ్​తో మూడోసారి!

ఈ సినిమాలో హరీశ్.. కథానాయిక​ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాడు. ఇందుకు గతంలో తనతో పనిచేసిన పూజా హెగ్డే అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట ఈ దర్శకుడు. ఇదే జరిగితే పవన్​తో తొలిసారి.. హరీశ్ శంకర్​తో పూజా హెగ్డే మూడోసారి పనిచేసినట్లు అవుతుంది.

ఈ చిత్రంలో హీరోయిన్​ గురించి, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

ఇదీ చదవండి: సినీ ప్రముఖుల వద్ద రూ.300 కోట్ల అక్రమ నగదు

Last Updated : Feb 29, 2020, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details