పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుంది. కొంతకాలం క్రితమే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినా షూటింగ్ మాత్రం ప్రారంభంకాలేదు. ఇప్పటికే పవన్ చేతిలో 'హరిహర వీరమల్లు', 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ చిత్రాలు ఉండటం వల్ల ఈ సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యమవుతుందని అంతా భావించారు. కానీ తాజాగా హరీశ్ పెట్టిన పోస్ట్‌తో ఈ అనుమానం పటాపంచలైంది.
పవన్ చిత్రంపై హరీశ్ ట్వీట్.. అర్థమదేనా? - పీఎస్పీకే 28
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు హరీశ్.
![పవన్ చిత్రంపై హరీశ్ ట్వీట్.. అర్థమదేనా? pawan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12083727-50-12083727-1623327127425.jpg)
తాజాగా హరీశ్ 'తిరిగి పని ప్రారంభించడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అంటూ పవన్ కల్యాణ్ 'గబ్బర్‌సింగ్' చిత్రీకరణకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి కాంబోలోని కొత్త సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనున్నట్లు అర్థమవుతోంది. ఈ ట్వీట్‌తో అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. 'గబ్బర్‌సింగ్'కు మించిన విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ వారు పోస్టులు పెడుతున్నారు.
ఇప్పటివరకు కనిపించని పాత్రను ఈ సినిమాలో పవన్ చేయనున్నారు. 'సంచారి' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవి శ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు.